నాగర్ కర్నూలు జిల్లాలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. మంగళవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావడంతో బలమైన గాలులు వీచాయి. ఈదురు గాలుల ధాటికి పలు చోట్ల వృక్షాలు నేలకొరిగాయి. వ్యవసాయ మార్కెట్లో రైతులు అమ్మకానికి తీసుకొచ్చిన వడ్లు, మొక్కజొన్న తడిసిముద్దయ్యాయి. వాతావరణ మార్పులతో ఈదురుగాలుల ఉధృతికి భారీ ఫ్లెక్సీలు చిరిగిపోగా.. ఉరుముల శబ్దాలకు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

