మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాజీ మంత్రి చేసిన అవినీతికి వనపర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు కోలుకోలేని దెబ్బపడిందని వ్యాఖ్యలు చేశారు. ఆయన మూడు నాలుగు ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారని.. చెప్ప లేనంత అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ‘నా గురించి ఇంకొక్కసారి ఎక్కడైనా మాట్లాడితే నీ తాట తీస్తా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో’ అంటూ నిరంజన్ రెడ్డికి కవిత ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు.

