నదీ జలాలపై కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు ఉపన్యాసాలు ఇస్తారా అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటే బీఅర్ఎస్కు కూడా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ‘మేము మీ దగ్గర నుంచి ఏమి నేర్చుకోవాలి. చెక్‌డ్యాంలు ఎలా ఫెయిల్ చేయాలో నేర్పిస్తారా. మేడిగడ్డ ఎలా పేల్చామో చెబుతారా. సుంకిశాల ఎలా కూల్చామో చూపిస్తారా. వట్టెం పంప్ హౌస్ ఎలా ముంచామో వివరిస్తారా అని కేటీఆర్ ప్రశ్నించారు.

