
ఉత్తరాఖండ్ పిథోర్గఢ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. మువాని పట్టణం నుంచి బోక్తాకు వెళ్తున్న జీపు సుని వంతెనకు సమీపంలో నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
మృతుల్లో ఇద్దరు విద్యార్థులు సైతం ఉన్నట్లు సమాచారం. ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా.. ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సహాయంతో పోలీసులు వారిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. మృతులందరూ బోక్తాకు చెందినవారని తెలుస్తున్నది.