సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ విజయ్,స్టాఫ్ నర్స్ సరస్వతి లవ్ మ్యారేజి చేసుకున్నారు అయితే సరస్వతిపై విజయ్ అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. కుటుంబ కలహాల నేపథ్యంలో సరస్వతి తన రెండేళ్ల కొడుకుతో విడిగా ఉంటుంది. భార్య సరస్వతిపై విజయ్ మరింత పగ పెంచుకున్నాడు. గురువారం ఉదయం భార్య ఉన్న చోటుకు విజయ్ కోపంగా వెళ్లాడు. నడిరోడ్డు మీదనే ఆమెపై కత్తితో దాడి చేశాడు. కిరాతకంగా ఆమెను పొడిచి చంపేశాడు. అంతటితో ఆగకుండా గొంతు కోశాడు.

