
రోడ్డు మధ్యలో గట్కా (కత్తితో ప్రదర్శన) ప్రదర్శిస్తున్న భారత సంతతికి చెందిన సిక్కు యువకుడ్ని అమెరికా పోలీసులు కాల్చి చంపారు. అతడ్ని 36 ఏళ్ల గురుప్రీత్ సింగ్‌గా గుర్తించారు. లాస్ ఏంజెలెస్ డౌన్‌టౌన్‌లోని క్రిప్టో.కామ్ అరీనా సమీపంలో ఒక కత్తి పట్టుకుని ఉన్నాడని పోలీసులు తెలిపారు. నచ్చచెబుతున్నా వినిపించుకోలేదు సరికదా పోలీసులపై దాడి చేయడానికి కూడా ప్రయత్నించడంతో అతడిపై కాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు.