
ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో బాలీవుడ్ నటి దిషా పటానీ ఇంటిపై కాల్పులు జరిగాయి. ఆమె నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ఈ దాడి వెనుక ఆమె సోదరి ఖుష్బూ పటానీ చేసిన కొన్ని వ్యాఖ్యలు కారణం సోషల్ మీడియాలో ధేలనా సోదరులు తామే ఈ దాడికి పాల్పడ్డామని ప్రకటించుకున్నారు. అంతేకాకుండా, దిషా పటానీ “సాధువులను అవమానించిందని” ఆరోపిస్తూ, సినిమా పరిశ్రమకు మరిన్ని చర్యలు ఉంటాయని హెచ్చరించారు.