
కల్తీ మద్యం కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సిట్ ఏర్పాటు చేస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. నకిలీ మద్యం కేసులో ఇప్పటివరకు 23 మంది నిందితులనుగుర్తించి, వీరిలో 16 మందిని అరెస్ట్ చేశారు. ఏలూరు రేంజ్ ఐజీ జీవిజీ అశోక్ కుమార్ నేతృత్వంలో సెట్ ఏర్పాటు చేయగా, సిట్ సభ్యులుగా రాహుల్ దేవ్ శర్మ, మల్లికా గార్గ్, ఎక్సైజ్ నుంచి మరొకరు ఉన్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం మొలకలచెరువులో కల్తీ మద్యం తయారీ ఇటీవల బయటపడింది.