
నకిలీ దంత వైద్యుల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ డెంటల్ అసోసియేషన్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ వేణు యాదవ్ కోరారు. కొందరు దంత వైద్యం చేయడానికి అర్హతలేని నకిలీ డాక్టర్స్ వైద్యం పేరిట నకిలీ ఇంప్లాంట్స్, నాణ్యతలేని మెటీరియల్స్ వాడుతూ ప్రజలకు అనారోగ్యం కలిగించడం మా దృష్టికి వచ్చిందని, క్వాలిటీ ఇంప్లాంట్స్, మెటీరియల్స్ వాడే వైద్యుల వద్ద మాత్రమే ట్రీట్మెంట్స్ పొందాలని తక్కువ ధరకు, ఉచిత చికిత్సకు ఆశపడి తమ సమయాన్ని ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవద్దని ప్రజలను వారు హెచ్చరించారు.