నిన్న హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ గద్దర్ అవార్డుల ఫంక్షన్ లో చిరంజీవి మాట్లాడుతూ పక్క రాష్ట్రం, ఇతర తెలుగు రాష్ట్రం అంటూ ఆంధ్రప్రదేశ్ ని సంబోధిస్తూ అన్న మాటలు సోషల్ మీడియాలో చర్చకు, వివాదానికి దారి తీశాయి. సిఎం రేవంత్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని అక్కడ కూడా నంది అవార్డులు ఇచ్చి, కళాకారులను గౌరవించే విధంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గారు చర్యలు తీసుకోవాలని చెప్పడం పలువురి ఆగ్రహానికి కారణమయ్యింది.ఏది ఏమైనా మెగాస్టార్ మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

