
ధర్మస్థల మిస్టరీ కేసులో కీలక మలుపు తిరిగింది. ప్రత్యేక దర్యాప్తు బృందం చేపట్టిన తవ్వకాల్లో బుధవారం రోజు మనిషికి చెందిన అస్థిపంజర అవశేషాలు బయటపడ్డాయి. ఇది ఈ కేసులో తొలి ఆధారంగా నిలిచే శారీరక సాక్ష్యంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు ఐదు చోట్ల తవ్వకాలు జరిపినా ఎటువంటి మానవ అవశేషాలు బయటపడలేదు. కానీ ఆరో స్థలంలో రెండో రోజు తవ్వకాల్లో మానవ అస్థిపంజరం భాగాలు లభ్యమయ్యాయి. SIT వర్గాల సమాచారం మేరకు అవి మనిషికి చెందినవే అని భావిస్తున్నారు.