శెట్టిబలిజ సంక్షేమ సంఘ స్థాపకులు దొమ్మేటి వెంకటరెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్య్రానికి పూర్వమే సామాజిక సేవ చేశారని.. శెట్టిబలిజ సంక్షేమ సంఘం ఏర్పాటుతో బలహీన వర్గాల ఆత్మగౌరవ జ్యోతి వెలిగించిన మహనీయుడు దొమ్మేటి వెంకటరెడ్డి. ఆయన చేసిన సామాజిక సేవలకు గుర్తుగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది.

