
ప్రపంచానికి నూతన సాంకేతికతను అందించడంలో సీఎస్‌ఐఆర్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఆదివారం నేషనల్ ఆకాడమీ ఆఫ్ సైన్స్, హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో.. ఐఐసీటీలో నిర్వహించిన నేషనల్ టెక్నాలజీ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశాభివృద్ధిలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం అత్యంత కీలక పాత్రను పోషిస్తుందన్నారు.