వరుసగా నకిలీ బాంబు బెదిరింపులకు పాల్పడుతున్న యువకుడిని గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు 50కిగా బాంబు బెదిరింపు మెయిల్స్ పంపినట్లు పోలీసులు తెలిపారు. స్కూల్స్, మెట్రో స్టేషన్లు, ముంబై స్టాక్ ఎక్స్‌ఛేంజ్ సహా వివిధ సంస్థలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీనిపై ముంబై, గుజరాత్ సహా పలు చోట్ల ఫిర్యాదులు అందాయి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సౌరవ్ విశ్వాస్ అనే 28 ఏళ్ల యువకుడు ఈ మెయిల్స్ పంపుతున్నట్లు గుర్తించారు. పశ్చిమ బెంగాల్ పోలీసుల సాయంతో సౌరవ్ విశ్వాస్‌ను అరెస్టు చేశారు.

