ఒకప్పుడు గురుగ్రామ్ అంటే దేశంలోనే అత్యంత సంపన్న జిల్లా. కానీ, ఇప్పుడు ఆ స్థానం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాది.తలసరి ఆదాయంలో గురుగ్రామ్‌ను అధిగమించి అగ్రస్థానానికి చేరింది. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో అత్యంత సంపన్న జిల్లాల జాబితాలో ఒక కీలక మార్పు చోటు చేసుకుంది. ఆర్థిక సర్వే 2024-2025 ప్రకారం, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా గురుగ్రామ్‌ను అధిగమించి, దేశంలోనే అత్యంత సంపన్న జిల్లాగా నిలిచింది. ఈ జిల్లా తలసరి జీడీపీ (GDP) రూ. 11.46 లక్షలుగా నమోదైంది.

