
కాళేశ్వరం నిర్మాణం దేశంలోనే అత్యంత పెద్ద మానవ తప్పిదమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో విమర్శించారు. లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసినా.. మేడిగడ్డ సహా మూడు బ్యారేజీలు 20 నెలలుగా పనికిరాకపోవడం రాష్ట్రానికి పెనుభారం అయ్యిందన్నారు. మాజీ సీఎం కేసీఆర్కు అప్పట్లో నిపుణులు పలు సార్లు హెచ్చరికలు చేసినా.. పట్టించుకోలేదని ఉత్తమ్ మండిపడ్డారు. NDSA నివేదికలో డ్యామ్, బ్యారేజీ మధ్య తేడా గుర్తించకుండా పనులు చేశారని.. ఇది మేడిగడ్డ కుంగిపోవడానికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు.