లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశంలో ఇంధన భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశం త్వరలో గ్యాస్, పెట్రోల్ వంటి ఇంధనాల విషయంలో పెద్ద సవాళ్లు ఎదుర్కొనే పరిస్థితి ఉందని హెచ్చరించారు. ప్రభుత్వ తప్పుడు విదేశాంగ విధానాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని రాహుల్ గాంధీ విమర్శించారు. గ్యాస్ కొరతతో దేశం ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ఇది కేవలం ప్రారంభం మాత్రమే అని ఆయన అన్నారు. ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

