
ఆంధ్రప్రదేశ్లో శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జ్ కోట వినుత డ్రైవర్ రాయుడు హత్య సంచలనంగా మారింది. శ్రీకాళహస్తి ఎంఎల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై వినుత ఆరోపణలు చేశారు. బొజ్జల సుధీర్ రెడ్డి తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో స్పందించారు. రాయుడు హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదంటూ.. దేవుడి మీద, తన పిల్లల మీద ప్రమాణం చేస్తున్నాను అన్నారు. దేవుడి సన్నిధిలో ప్రమాణం చేసి చెబుతున్నాను అన్నారు. ఈ ఘటనలో తన ప్రమేయం లేదని.. .. రాజకీయ కారణాలతో ఘటన జరిగిందన్నారు.