దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కె.శాంతిపై సస్పెన్షన్ వేటుపడింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లుగా ఏసీబీ కేసు నమోదైన నేపథ్యంలో ఆమెను సస్పెండ్ చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఆదేశాలు జారీ చేశారు. శాంతికి సంబంధించిన ఆస్తులపై మూడు చోట్ల తనిఖీలు చేశారు. వీటిలో రూ.1.37 కోట్ల మేర ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమెను అదే రోజు అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరచగా.. ఈ నెల 21 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు.

