
మధ్యప్రదేశ్లో పెను విషాదం చోటుచేసుకుంది. దుర్గామాత నిమజ్జనంలో అపశృతి జరిగింది. గురువారం ఖండ్వా జిల్లాలో దుర్గామాతను నిమజ్జనం కోసం తీసుకెళుతుండగా ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. నీటిలోకి వెళ్లిన తర్వాత ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది. ట్రాలీ కింద చిక్కి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 8 మంది బాలికలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.