
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సతీసమేతంగా ఆలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబుకు దుర్గగుడి అధికారులు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు, భువనేశ్వరి దంపతులకు పండితులు శాస్త్రోక్తంగా వేదాశీర్వచనం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఇంద్రకీలాద్రి పై దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి.