దుబాయ్లో జరుగుతున్న ఎయిర్ షోలో ప్రమాదం చోటు చేసుకుంది. భారత్కు చెందిన తేజస్ యుద్ధ విమానం కూలిపోయింది. ఎయిర్ షోలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ప్రదర్శన జరుగుతుండగా.. విమానం ఒక్కసారిగా కూలిపోయింది. ఆ వెంటనే పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా భయాందోళన వాతావరణం నెలకొంది. పైలట్ ప్రమాదం నుంచి బయటపడ్డాడా..? లేదా..? అన్నది స్పష్టంగా తెలియలేదు. కానీ, ప్రమాద తీవ్రతను చూస్తుంటే పైలట్ బతికే ఛాన్స్ లేదనే తెలుస్తోంది.

