ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్‌లో మూడో రోజు పర్యటనలో భాగంగా యూఏఈ ఆర్థిక వ్యవహారాలు, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. యూఏఈ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య వాణిజ్య బంధం పెంచుకునే అంశంపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది. యూఏఈ ఆర్థిక వ్యవహారాల మంత్రి. లాజిస్టిక్స్, రవాణా, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులు, నూతన భాగస్వామ్యాల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు, యూఏఈ ఆర్ధిక వ్యవహారాల మంత్రి చర్చించారు.

