
జూబ్లీహిల్స్లో జరిగిన మీటింగ్లో పొన్నం ప్రభాకర్ మరియు అడ్లూరి లక్ష్మణ్ మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది. అడ్లూరి సమయానికి రాలేదని “దున్నపోతు” అంటూ అవమానించిన పొన్నం వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద రాజకీయ వివాదంగా మారాయి. “మాదిగ జాతిలో పుట్టానని నన్ను అవమానిస్తారా?” అంటూ అడ్లూరి ఆవేదన వ్యక్తం చేశారు. రేపటి వరకు క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.