
ప్రభాస్ నటించిన ది మోస్ట్ అవైటెడ్ మూవీ ది రాజా సాబ్. సలార్, కల్కి వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత డార్లింగ్ నటిస్తోన్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 2026 జనవరి 9న ఈ సినిమా విడుదల కానుంది . అయితే సినిమా రిలీజ్ కు వంద రోజులు ఉండగానే ది రాజా సాబ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.