ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ పై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటును పొడిగించడంపై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఘాటుగా స్పందించారు. పదవి విరమణ వరకు దళిత ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ని సస్పెండ్ చేయడం అంటే దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని అభిప్రాయపడ్డారు. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు అహం సంతృప్తి పరచడం కోసం దళిత వర్గాలపై చంద్రబాబు చూపిన వివక్షకు ఇది నిదర్శనం అని చెప్పుకొచ్చారు

