రేణుకాస్వామి అనే వ్యక్తి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్, హీరోయిన్ పవిత్ర గౌడలకు సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. వారిద్దరిని వెంటనే అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించడంతో బెంగళూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. కొద్ది గంటల్లోనే పవిత్ర గౌడని, దర్శన్‌ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ కేసులో వారిద్దరు ప్రస్తుతం బెయిల్‌పై బయటకు ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి తీవ్రమైన కేసుల్లో నిందితులకు బెయిల్ ఇవ్వడం మంచిది కాదని అభిప్రాయపడుతూ సుప్రీంకోర్టు వారి బెయిల్ రద్దు చేసింది.

