దక్షిణాది రాష్ట్రాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి చిన్నచూపు ఉందని, కేంద్ర ప్రభుత్వంలోని కీలక శాఖలు ఒక్కటి కూడా దక్షిణాది రాష్ట్రాల వారికి ఇవ్వలేదన్నారు.కాంగ్రెస్ హయాంలో దక్షిణాది రాష్ట్రాల నుంచి రాష్ట్రపతి పదవులు పొందిన వారు ఉన్నారని.. కానీ బీజేపీలో అలాంటి పరిస్థితి కనిపించట్లేదన్నారు. తాజాగా ఓ టీవీ ప్రోగ్రామ్ లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి అనేక విషయాలపై స్పందించారు డీలిమిటేషన్ కు తాము వ్యతిరేకం కాదని.. కానీ వివక్ష చూపిస్తే కచ్చితంగా గళం విప్పుతానని చెప్పారు

