
హైదరాబాద్‌లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. సహాయం కోసం కంట్రోల్ రూమ్ నంబర్‌ను సంప్రదించమని అధికారులు తెలిపారు రాయదుర్గం, బయోడైవర్సిటీ, ఐకియా జంక్షన్ల వద్ద కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కొన్ని రోడ్లు నాలాలను తలపించాయి. ఐటీ కారిడార్ రోడ్లు ‘స్విమ్మింగ్ పూల్స్’ను పోలి ఉన్నాయని వాహనదారులు అసహనం వ్యక్తం చేశారు.