తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉద్యోగుల డీఏ బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏల చెల్లింపుపై ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టతనిచ్చారు.త్వరలోనే డీఏ బకాయిలు ఉద్యోగులకు చెల్లిస్తామని అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. ఇవాళ నాలుగో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా.. ప్రశ్నోత్తరాల సమయంలో ఉద్యోగుల సమస్యలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు.

