
ఏఐ రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న ప్రముఖ సంస్థ ఓపెన్ ఏఐ సంస్థ సీఈవో శామ్ ఆల్ట్మన్ కొత్త మోడల్ జీపీటీ-5ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఇండియాలో ఏఐ వినియోగంపై ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమెరికా తర్వాత ఓపెన్ఏఐకి అతిపెద్ద మార్కెట్ ఉన్న దేశం భారత్ అని ఆయన అన్నారు. ఇండియాలో ఏఐ వినియోగం అతి వేగంగా పెరుగుతోందని, అతి తక్కువ సమయంలోనే భారత్ ఏఐ వినియోగంలో ఆమెరికాను క్రాస్ చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.