
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. మొదటి విడతకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు అధికారులు ప్రత్యేక ప్రకటన చేశారు. మొదటి దశలో 292 జడ్పీటీసీ, 2, 963 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీనికి ఇవాళ్టి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరిస్తారు. 12న వాటిని పరిశీలిస్తారు. 15 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఈ నెల 23న పోలింగ్ జరగనుంది. నవంబర్ 11న ఓట్ల లెక్కింపు ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.