తెలంగాణలో జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన పార్టీ నిర్ణయించింది. ఈ మేరకుజనసేన పార్టీ ఒక ప్రకటనవిడుదల చేసింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనే లక్ష్యంతో ఇప్పటికే పార్టీ కార్యచరణ ప్రారంభించింది అని ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికలకు నెలరోజుల కంటే తక్కువ సమయం ఉన్నప్పటికీ…సాధ్యమైనన్ని స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు అని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ తెలిపారు.

