
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన లక్ష్యంగా బీసీ సంఘాలు జరపనున్న రాష్ట్ర బంద్‌కు బీఆర్ఎస్ మద్దతిచ్చింది. వివరాలు… అక్టోబర్ 18వ తేదీన బీసీ సంఘాలు జరపనున్న బంద్‌కు మద్దతు
కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను బీసీ సంఘాల నేతలు, రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… జాతీయ స్థాయిలో ఓబీసీ సంక్షేమ శాఖ ఉండాలని కోరిన ఏకైక తొలి నాయకుడు కేసీఆర్ అని అన్నారు.