
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‍ను సర్వోన్నత న్యాయస్థానం గురువారం కొట్టివేసింది. ఈ కేసు విచారణ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కావాలనుకుంటే పాత రిజర్వేషన్లపై ఎన్నికలకు వెళ్లవచ్చని పేర్కొంది.అంతేకాదు రిజర్వేషన్లు 50 శాతం దాటడం రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. హైకోర్టులో తదుపరి విచారణ కొనసాగుతుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.