మావోయిస్టు దళంలోని మరో అగ్రనేత బర్సెదేవా అలియాస్ సుక్కాతో పాటు 15మంది మావోయిస్టులు తెలం గాణ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఇటీవల పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో కలిసి బర్సెదేవా సుమారు 15 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పనిచేసినట్లు తెలుస్తోంది. సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన పలు దాడుల్లో బర్సెదేవా కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. బర్సెదేవాపై రూ.50 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు గతంలోనే ప్రకటించారు.

