తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ హయాంలో జరిగిన విద్యుత్తు ఒప్పందాల్లో అవకతవకలు జరిగాయని జస్టిస్ మదన్ బి.లోకూర్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును సీబీఐకి బదిలీ చేయాలని నిర్ణయించింది. ఛత్తీస్గఢ్ తో చేసుకున్న ఒప్పందాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆర్థిక భారం పడిందని, దీని వెనుక భారీగా అవినీతి జరిగిందని భావిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024లో లోకూర్ కమిషన్ ఏర్పాటు చేసింది. విద్యుత్తు ఒప్పందాలపై విచారణను సీబీఐకి అప్పగించాలని కేబినెట్ నిర్ణయించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

