తెదేపా 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు తెదేపా జెండా ఎగురవేశారు. అనంతరం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్,పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెదేపా ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జరిగిన ముఖ్య ఘట్టాలతో వీడియోను ప్రదర్శించారు.ఎన్టీఆర్ బస్సు యాత్ర, విధాన నిర్ణయాలు, ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చిన సంక్షేమ కార్యక్రమాలను అందులో పొందుపరిచారు.

