
గుంటూరు జిల్లాలోని తురకపాలెం గ్రామంలో ఇటీవల సంభవించిన మెలియాయిడోసిస్ వ్యాధి ప్రాణాంతక రూపం దాల్చి స్థానికులను తీవ్ర విషాదంలో ముంచింది. ఈ వ్యాధి కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోవడంతో మంత్రి డాక్టర్ పెమ్మసాని అభ్యర్థనకు స్పందించిన ముఖ్యమంత్రి, మెలియాయిడోసిస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. మొత్తం 28 కుటుంబాలకు పరిహారం చెక్కులు నేడు అధికారుల సమక్షంలో కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అందజేయనున్నారు.