తిరుమల శ్రీవారి సేవలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తాను టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో శ్రీవారి నిధులను ఆదా చేయడానికి కృషి చేశామని చెప్పారు. రాజకీయ కుట్రతోనే సీఎం చంద్రబాబు శ్రీవారి లడ్డూ ప్రసాదానికి అపవిత్రత ఆపాదించేలా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమల కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం గురువారం రోజున వైవీ సుబ్బారెడ్డిని ప్రశ్నించింది.

