విశాఖ హైవేపై రాయుడు మిలిటరీ హోటల్లో తిరుమల శ్రీవారి గర్భాలయ నమూనాతో నాన్వెజ్ వడ్డిస్తుండటం వివాదాస్పదమైంది. శ్రీవారి గర్భాలయ నమూనాను ఏర్పాటు చేసి మాంసాహారం వడ్డిస్తుండటంతో హిందూ సంఘాలు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హోటల్ యాజమాన్యం మాత్రం గర్భాలయ నమూనా ఎదురుగా వెజ్ మాత్రమే వడ్డిస్తున్నామని తెలిపింది. ఈ ఘటనపై టీటీడీ అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

