తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలలో చదువుతున్న 500 మంది విద్యార్థులు వెస్ట్ పోలీసులకు వ్యతిరేకంగా నిరసన తెలిపి కలెక్టర్కు వినతిపత్రమిచ్చారు ఈనెల 1 రాత్రి ఆస్పత్రిలో విధులు పూర్తయిన తర్వాత వైద్య విద్యార్థులు హరీష్, జయంత్ భోజనం కోసం వెస్ట్ పోలీస్స్టేషన్ వైపు బైక్పై వెళుతుంటే పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఎస్ఐకి ఫిర్యాదు చేశామనీ ఆయనతో పాటు యూనిఫాంలో లేని కొందరు లాఠీలతో దాడి చేశారని చెప్పారు. డ్యూటీల నిమిత్తం వైద్య విద్యార్థి, విద్యార్థిని వెళుతుంటే అసభ్యంగా మాట్లాడుతున్నారని వాపోయారు.

