అమానవీయత పరాకాష్టకు చేరిన వేళ, మనిషిలోని క్రూరత్వం మొబైల్ కెమెరా వెనుక దాగి కనిపిస్తోంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్లో తీవ్రమైన ఎండ వేడికి తట్టుకోలేక ఓ మహిళ రోడ్డుపై స్పృహతప్పి పడిపోయింది. పక్కనే తన ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు మండే ఎండలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న తల్లిని కాపాడుకోవడానికి ఎనిమిదేళ్ల పసివాడు పడుతున్న ఆవేదన చూస్తుంటే కళ్లు చెమర్చని వారు ఉండరు. కానీ, ఆ దృశ్యాన్ని రికార్డ్ చేస్తున్న వ్యక్తికి మాత్రం కనికరం కలగలేదు.

