కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న వీకే శశికళ, తన నూతన పార్టీకి ‘ఆలిండియా పురుచ్చి తలైవార్ మక్కల్ మునేత్ర కళగం’ (AIPTMMK) అని పేరు పెట్టారు. ఏఐఏడీఎంకే (AIADMK) వ్యవస్థాపకులు, దివంగత ఎంజీ రామచంద్రన్ (MGR)ను ‘పురుచ్చి తలైవార్’ అని పిలుచుకుంటారు. పార్టీ గుర్తుగా ‘కొబ్బరి చెట్టు’ ను శశికళ ప్రకటించారు. కొబ్బరి చెట్టు ఐక్యతకు చిహ్నమని, ఇప్పటికే ఆవిష్కరించిన పార్టీ జెండాలో నలుపు, తెలుపు, ఎరుపు రంగులతో పాటు అన్నాదురై, ఎంజీఆర్, మరియు జయలలిత చిత్రాలను పొందుపరిచారు.

