త్వరలోనే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు పొత్తులు, సీట్ల కోసం అప్పుడే కసరత్తు ప్రారంభించాయి. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా, ఏఐఏడీఎంకే కీలక నేత పళనిస్వామి మధ్య సీట్ల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీకి పోటీ చేయబోయే సీట్లు, మంత్రి పదవుల విషయంలో అమిత్ షా ఆచితూచి అడుగులేస్తున్నారు. అక్కడ మొత్తం 234 అసెంబ్లీ సీట్లకుగాను, 56 సీట్లు కావాలని అమిత్ షా.. పళనిస్వామిని అడిగారు.

