తమిళనాడులో ఎన్నికల హడావుడి మొదలైంది. తమిళనాడు ముఖ్యమంత్రి , DMK అధినేత MK స్టాలిన్ చెన్నైలోని కొళత్తూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. నామ పత్రాలు దాఖలు చేసే సమయంలో ఆయన వెంట పార్టీ కీలక నేతలు ఉన్నారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత స్టాలిన్ రోడ్ షో నిర్వహించారు. ప్రజలకు అభివాదం చేస్తూ తనను మళ్లీ ఆశీర్వదించాలని కోరారు. కొళత్తూర్‌లో చేపట్టిన అభివృద్ధి పనులపై ఒక పుస్తకాన్ని విడుదల చేశారు.

