
తమిళగ వెట్రి కజగం (TVK) మహానాడు చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో కలిసి కార్యక్రమానికి విజయ్ హాజరుకావడం హాట్‌టాపిక్‌గా మారింది. విజయ్.. తన స్పీచ్‌లో ఆరు ప్రధాన అంశాలను ప్రస్తావించారు.. మహిళల భద్రతతో పాటు సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు టీవీకే దూరంగా ఉంటుందని తెలిపారు. కుల,మతాల ప్రస్తావన వద్దే వద్దంటూ నేతలకు సూచించారు. 2026లో తమిళనాడులో చరిత్ర సృష్టించబోతున్నామన్న ధీమా వ్యక్తం చేశారు విజయ్. అన్నాదురై, MGR తెచ్చిన మార్పులను తీసుకొస్తామన్నారు.