
కెనడా ప్రభుత్వం ఇటీవలే ఖలిస్థానీ వేర్పాటువాద సంస్థలకు నిధులు తమ దేశం నుంచే వాస్తవాన్ని తొలిసారి అధికారికంగా అంగీకరించింది.కెనడా ప్రభుత్వం ఈ విషయాన్ని తన మానీలాండరింగ్, ఉగ్రవాద ఫండింగ్ పరిశీలనలలో భాగంగా ప్రకటించింది. బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ సిక్ యూత్ ఫెడరేషన్ వంటి ఖలిస్థానీ వేర్పాటువాద గ్రూపులతో పాటు హమాస్, హెజ్బొల్లా వంటి సంస్థలు కూడా కెనడాలోని వ్యక్తులు, సంస్థల నుంచి ఆర్థిక సహాయం పొందుతున్నాయని ఆ నివేదిక వెల్లడించింది.