తుళ్లూరు పోలీస్ సబ్ డివిజన్ నూతన కార్యాలయాన్ని ఇవాళ అనిత ప్రారంభించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సోషల్మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే సహించబోమని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు.
కల్పిత వీడియోల ద్వారా చాలామంది ఇబ్బంది పెడుతున్నారని.. అలాంటి వాటిని ఏపీ పోలీసులు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్లో ఓ లారీపై రాళ్లు వేసిన వీడియోను..ఏపీలో జరిగినట్లు ప్రచారం చేశారని మండిపడ్డారు.

