ఢిల్లీలో కాలుష్య స్థాయిలను పెంచేందుకు క్లౌడ్ సీడింగ్ విఫలమైంది కాన్పూర్ నుంచి బయల్దేరి విమానం 6,000 అడుగుల ఎత్తులో రసాయనాలను వెదజల్లింది. అయితే, ఈ ప్రయత్నం విఫలమైంది. ప్రక్రియ పూర్తయి నాలుగు గంటలైనా వర్షాలు కురవకపోవడం అందరినీ నిరుత్సాహపర్చింది. బుధవారం ఉదయం ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక 300 కంటే ఎక్కువగానే నమోదైంది. ఆనంద్ విహార్ అబ్జర్వేటరీలో ఏక్యూఐ లెవెల్స్ 312గా నమోదయ్యాయి.

